![]() |
![]() |
బుల్లితెరపై ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని, తన నటనతో అలరించిన ప్రముఖ టెలివిజన్ నటి అదితి శర్మ వ్యక్తిగత జీవితంలో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంటోంది. మెరిసే గ్లామర్ ప్రపంచం వెనుక దాగివున్న నిజ జీవితపు చేదు నిజాలు ఇప్పుడు ఆమె కేసుతో మరోసారి వెలుగులోకి వచ్చాయి. తన భర్త, అత్తమామలు, ఆడపడుచులు తనను తీవ్రంగా మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారని ఆరోపిస్తూ అదితి శర్మ ముంబైలోని గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రారంభమైన చిన్నచిన్న వివాదాలు చినికి చినికి గాలివానలా మారి, చివరికి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కే వరకు వెళ్లాయి. భర్త అసమర్థత, నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, ఇంటి ఖర్చులను ఆయన ఎప్పుడూ పట్టించుకోకపోగా, తన సంపాదన నుంచే డబ్బులు గుంజేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అదితి శర్మ స్పష్టం చేశారు.
ఈ గృహహింస వివాదానికి పునాది ముఖ్యంగా ఒక చిన్న సంఘటనతో మొదలైంది. 1 జనవరి 2025న కేవలం కాఫీ విషయంలో జరిగిన ఒక చిన్న వివాదం పెద్దదిగా మారి, భర్త ఆమెను తీవ్రమైన బూతులు తిట్టే వరకు వెళ్లింది. ఆ సంఘటన తర్వాత నుంచి ఆమె భర్త ప్రవర్తనలో తీవ్రమైన మార్పు వచ్చిందని, తన క్యారెక్టర్‌ను శంకించడం, అక్రమ సంబంధాలు అంటగట్టడం, ఫోన్‌ను పదే పదే చెక్ చేస్తూ నిఘా పెట్టడం, వేరే గదిలో పడుకోవడం ప్రారంభించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేయడమే కాకుండా, తన కన్నతల్లిదండ్రులతో కూడా మాట్లాడకుండా భర్త పూర్తిగా నిరోధించాడని తెలిపారు. బాధితురాలికి కుటుంబం ఇచ్చే మద్దతును కూడా కట్ చేసి, ఆమెను ఒంటరిని చేసే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపించింది.
వేధింపులు అక్కడితో ఆగలేదు, ఆర్థికంగా కూడా ఆమెను తీవ్రంగా దోచుకున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. పెళ్లి సమయంలో స్త్రీధనం కింద వచ్చిన తన బంగారు ఆభరణాలలో శ్రేష్ఠమైన బంగారు గొలుసులు, ఉంగరాలు, డైమండ్ రింగ్, మంగళసూత్రం మరియు గాజులను అత్తగారు తన వద్దే ఉంచుకుని, ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వలేదని టీవీ నటి తీవ్ర ఆరోపణలు చేశారు. దంపతుల మధ్య గొడవలు సద్ధుమణిగేలా చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ అత్త మరియు ఆడపడుచులు భర్తకే సపోర్ట్ చేస్తూ, తనను మరింత మానసికంగా వేధించారని చెప్పారు. ఈ క్రమంలోనే ఏమీ చేయలేని పరిస్థితిలో చట్టబద్ధమైన పోరాటానికి దిగి గోరేగావ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు ముమ్మర విచారణ జరుపుతున్నారు.
![]() |
![]() |